గుండె పోటు తెప్పిస్తున్న ఆ అగ్ర హీరో పారితోషకం

Mahesh Babu shocking renumeration

మహేష్ బాబు తెలుగు చలన చిత్రరంగంలోనే అతి పెద్ద హీరోలలో ఒకడు. సూపర్ స్టార్ మహేష్ బాబు పారితోషకం అక్షరాలా 50 కోట్లు అనే ఓ వార్త అందరిని ఆశ్చర్యంతో ముంచెత్తుతుంది.

మహేష్ బాబు ఒక పెద్ద సూపర్ స్టార్ అనే విషయంలో ఎటువంటి సందేహమే లేదు. ఇది మరో సారి రుజువు చేస్తున్నాయి, తన పారితోషకం 50 కోట్లు అన్న వార్తలు. ఇంతకు ముందే మేం చెప్పినట్లు చిరంజీవి – కొరటాల శివ కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ఓ గెష్ట్ పాత్ర పోషించనున్నాడు మహేష్ బాబు. ఆ పాత్రకు గాను నిర్మాతలు మహేష్ కు 50 కోట్ల పారితోషకం సమర్పించకోటానికి సైతం వెనుకాడట్లేదంట. కానీ ఇటీవలె కాలంలో మహేష్ బాబు ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వటంలో మాత్రం చతికిలపడుతున్నాయి. ఆఖరిగా మహేష్ బాబు బ్రేక్ ఈవెన్ అయ్యిన చిత్రం 2015 లో రిలీజ్ అయిన శ్రీమంతుడు. మరీ ఈ తరుణంలో ఓ చిన్న గెష్ట్ రోల్ కి 50 కోట్లు పారితోషకం ఇవ్వటం అంటే ఎంతైనా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. ఈ గెష్ట్ రోల్ కి మహేష్ బాబు ఇంకా ఓకే చేయాల్సి ఉంది. వచ్చే వారంలో దర్శకుడు కొరటాల శివ, తన పాత్ర గురించి వివరించనున్న నేపధ్యంలో మహేష్ ఏం చేస్తాడో అని ఆశక్తిగా వేచి చూస్తున్నాయి ఇండష్ట్రీ వర్గాలు.

మహేష్ బాబు వంశి పైడిపల్లితో చేయాల్సిన చిత్రం నుండి వెనక్కి తప్పుకున్నది తెలిసిన విషయమే. దీంతో మహేష్ బాబు తదుపరి చిత్రం దర్శకుడు పరశురాంతో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ చిత్రానికి సైతం మహేష్ బాబు 50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలి హిట్ టాక్ సొంతం చేసుకున్నా లాభాలు తీసుకురాని నేపధ్యంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టే విధంగా 50 కోట్ల భారీ పారితోషకం డిమాండ్ చేయటం ఎంత వరకు సమంజసమో మహేష్ బాబు సైతం ఆలోచించుకోవాల్సింది ఉంది.