మళ్ళీ రిస్క్ తీసుకుంటున్న రెబెల్ స్టార్ ప్రభాస్

Prabhas movie with Sandeep Vanga

ఆల్రెడీ సాహోతో అనుభవం లేని దర్శకుడితో పని చేసి డిసాష్టర్ మూటకట్టుకున్న ప్రభాస్ మరోసారి రిస్క్ చేయటానికి సిధ్ధమవుతున్నాడు. అయితే ఈ సారి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో.

ప్రభాస్ కు బాహుబలితో దేశమంతటా ఎదురులేని క్రేజ్ వచ్చింది. దీంతో తన తదుపరి చిత్రం సాహో మీద ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ లాంటి యువ దర్శకుడితో అంత భారీ బడ్జెట్ చిత్రం తీయటమే ముంచేసంది ప్రభాస్ ని. కాని ఇప్పుడు ప్రభాస్ మరోసారి అదే రిస్క్ తీస్కునేందుకు తయారు అవుతున్నాడు. సందీప్ రెడ్డీ వంగ ఒక యువ దర్శకుడు. తన మొదటి సినిమా అయిన అర్జున్ రెడ్డీ ఒక సంచలనం. అదే సినిమాని కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి భారీ బ్లాక్ బష్టర్ అందుకున్నాడు సందీప్ రెడ్డీ. ఆ సినిమా విజయం బాలీవుడ్ లో తనకి మరెన్నో అవకాశాలు తెచ్చిపెడుతుంది అనుకున్నాడు సందీప్ రెడ్డీ. కానీ అంచనాలకు భిన్నంగా ఒక్క అవకాశమూ రాలేదు. దీంతో సందీప్ రెడ్డీ మళ్ళీ తన మాతృ పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ తరుణంలో సందీప్ రెడ్డీ ప్రభాస్ కు ఓ కథాంశాన్ని వినిపించాడు అంట. అది ప్రభాస్ కు నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ తో వస్తే సినిమా చేద్దాం అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సందీవ్ రెడ్డీ పూర్తిగా ఆ స్క్రిప్ట్ పనుల్లో నినగ్నమయినట్లు తెలుస్తుంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాథా కృిష్ణతో ఓ ప్రేమ కథకి పని చేస్తున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం ఆఖరుకు విడుదల కానుంది. దాని తర్వాత చిత్రం సందీప్ రెడ్డీ వంగా తో ఉండబోతుంది. ఇప్పటికే అనుభవంలేని దర్శకుడికి అవకాశం ఇచ్చి దెబ్బ తిన్న ప్రభాస్ ఈ సారైనా హిట్ కొడతాడోలేదో చూడాలి.