అతన్ని కలవటంతో ఎమోషనల్ అయిపోయిన తమన్

Thaman about Pawan Kalyan movie

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కాని తమన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను కలవటంతో ఎమోషనల్ అయిపోయాడట.

పవన్ కశ్యాణ్ రాజకీయాల నుండి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హిందీ చిత్రం అయిన ‘పింక్’ రీమేక్ తో పవన్ కశ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలా వైకుంఠపురములో తో ఒక పెద్ద బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన తమన్ ని పంక్ రీమేక్ కు సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సందర్భంగా తమన్ పవన్ కశ్యాణ్ ను కలవటం జరిగింది. తన అభిమాన నటుడిని కలవటంతో తమన్ చాలా భావోద్వేగానికి గురయ్యాడంట. ఈ విషయం గురించి స్పందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా తాను వేచి చూస్తున్న సమయం రానే వచ్చిందని పవన్ కశ్యాణ్ గారిని కలవటం ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. తన సంగీతాన్ని పవన్ కళ్యాణ్ కు వినిపించినట్లు కూడా ఈ ట్వీట్ లో పేర్కొన్నారు తమన్.

ఈ సందర్భంగా, పవన్ కళ్యాన్ రీ ఎంట్రీ సినిమా అయిన పింక్ రీమేక్ పనులు సరవేగంగా అవుతున్నట్లు కూడా వెల్లడించారు. చిత్రంలోని మొదటి పాటను అతి తొందరలోనే విడుదల చేస్తాం అన్నారు. ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ పింక్ లోని అమితాబ్ గారి పాత్రను పోషించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.