వైకాపా కుల రాజకీయాలు మాయని మచ్చ!

Rebellions in YSRCP, Supremo Jagan to hold a crucial meeting

ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు కొత్తేమి కాదు.ఈ వ్యవస్థ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలంనుంచి వెలుగులో ఉండేది.ఎప్పుడు రెడ్ల కులానికి కమ్మ కులానికి ఒక విదమైన కృత్రిమ వైరం ఉండేది.అయితే ఇది తెరచాటు గా ఉండేది.


ఒక విధంగా ఈ వ్యవస్థ ఒక మంచి వాతావరణంగానే ఉనింది.ఈర్ష్య ద్వేషం లేకుండా ఉనింది.అన్ని కులాల వారికి అన్ని పనులు సకాలంలో జరిగేది.ఒక కులం మీద ఇంకొక కులానికి గౌరవం ఉండేది.ఒక మతం మీద ఇంకొక మతానికి ప్రేమానురాగాలు కనబరచు కొనేవారు.ఈ వ్యవస్థ ఎంతో ఆదర్శంగా ఉండేది.ఇది ఎన్టీఆర్ కాలంలోను, తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాలంలోను చెక్కు చెదరకుండా ఆచరించారు.

ఇప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ప్రస్తుత ప్రభుత్వాలు ధర్మాన్ని, న్యాయ వ్యవస్థ ను, కుల వ్యవస్థ ను మంట గలిపి మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పు దోవ పట్టించి మానవతా విలువలు ను తుంగలో తొక్కినారనడంలో ఏమాత్రం సందేహ పడనవసరం లేదు.అసలు నవ్యాంధ్ర లో ఇప్పటి ప్రభుత్వం సాధారణ కార్యకర్తల నుండి అగ్ర నాయకుల వరకు దళిత,బడుగు,బలహీన వర్గాలను అణచివేసే తీరును మనం చూడడం జరిగింది.

దీనికి నిదర్శనం ఇటీవలే మనం చూచిన ఒక దళిత డాక్టర్ను పిచ్చి వాడిని చేయడం, దళిత యువకుడిని మాస్క్ వేసుకోలేదని వొక కానిస్టేబుల్ కొట్టి చంపడం ఇంకొక దళితుడిని పోలీసు స్టేషన్లో శిరోముండనం చేయడం దళిత బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ఇలా ఎన్నో ఉదాహరణలు.దీనిపైన ప్రభుత్వం ఏ వొక్క చర్య తీసుకోక పోవడం.ఇటువంటివి చూస్తుంటే ప్రభుత్వానికి మానవతా విలువలు తెలియదు అనే చెప్పాలి.

ఏదిఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం కొంతైనా కళ్ళు తెరవాలని ఈ కుల రాజకీయాలు ఇకనైనా మానుకోవాలి అని ప్రజలు ఎదురు చూపుగా మిగిలి పోయింది.