నిమ్మగడ్డ విషయములో జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

Ramesh Kumar appointment cancelled

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు లోను ఎదురు దెబ్బ తగిలింది. దీనిని ఎదురు దెబ్బ అనడానికన్న ఇకనైనా ప్రభుత్వం తన కళ్లు తెరిచి మెరుగైన సమాజం కోసం మెరుగైన సేవలు అందించాలని ప్రజల ఎదురు చూపు. అసలు విషయం ఏమిటంటే హైకోర్టు లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది అందులో తీర్పు రమేష్ కుమార్ కు అనుకూలంగా రావడం దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు లో స్టే కోరడం అందరికి తెలిసిందే.

ఈ సమయమున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలిసి హైకోర్టు తీర్పు మేరకు వివరించడం జరిగింది. దీని మీద గవర్నర్ స్పందించి హైకోర్టు తీర్పు ప్రకారము రమేష్ కుమార్ ను విధులలోకి తీసికొమ్మని సూచించడం జరిగింది. దీనిమీద కూడా ప్రభుత్వం తన మొండి పట్టుదల వదలలేదు. సుప్రీం కోర్టు లో వారు వేసిన పిటిషన్ మీద ఆధారపడి తీర్పు ను ఎదురు చూవచింది. ఈ పిటిషన్ మీద సుప్రీం కోర్టు లో ఈ రోజు విచారణ కు వచ్చింది.


సుప్రీం కోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు ను వచ్చే శుక్రవారం లోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విధులలోకి తీసికొన వలసినది గా ఉత్తర్వులు జారీ చేసింది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము పెదవి విప్ప కుండ ఆ మొండి పట్టుదల తోనే ఉంటుందా లేక సుప్రీం కోర్టు తీర్పు ను అమలు చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.