కరోనా కట్టడిని పూర్తిగా మరచిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

KCR Andhra Pradesh 25 Districts
File Pic of Ys Jagan meeting KCR

తెలుగు రాష్ట్రాలలో ఏమి జరుగుతుంది.రెండు రాష్ట్రాలలో కరోనా విజృంభణ కట్టడి చేయలేని తీరుగా మారింది.అయినా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దూకుడు కూడా కట్టడి చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం.


అసలు విషయానికి వస్తే తెలంగాణా ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటి.మొట్టమొదట సచివాలయం కూల్చివేత ఆరంభం అయినప్పటి నుంచి ఈ ముఖ్యమంత్రి దూకుడు చూస్తే దానికి అంతే లేదు. కూల్చివేత ఆరంభించిన తత్ఛణమే పోచమ్మ గుడిని తరువాత మసీదు ను కుల్చివేశారు.దీని తరువాత సౌత్ ఎడ్జి నార్త్ ఎడ్జి మరియు 15 బిల్డింగ్ లు కూల్చివేసినారు.ఈసమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ తన ఫామ్ హౌస్ లో ఎవరికి చెప్పకుండా క్వారంటైన్ లో ఉన్నారు.దేవాలయం మరియు మసీదులు కూల్చివేత కు పెద్దగా విమర్శలు వెలువడడం తో ఎదురు చూడకుండా జరిగి పోయింది మునుపటి దానికన్నా పెద్దగా కట్టిస్తాను అని మొసలి కన్నీరు కార్చినారు ఈ ముఖ్యమంత్రి.


దీని తర్వాత హై కోర్టు లో కూల్చివేతకు స్టే విధించారు ముఖ్యమంత్రి సడెన్ గా వెలుగులోకి వచ్చినారు మరల హైకోర్టు కూల్చివేత కు పర్మిషన్ ఇచ్చేసింది.

దీని తరువాత పత్రికా విలేఖరులకు కూల్చివేతప్పుడు పర్మిషన్ లేదు అన్నారు మరల పర్మిషన్ ఇచ్చారు.ఇంతలో ఈరోజు శరవేగంగా భవనాలను కూల్చివేసి పత్రికా విలేఖరులనందరిని వొక్క వాహనము లోనే అంటే కరోనా నిబంధనలను కూడా పాటించకుండా తీసుకెళ్ళి చూపించడం ప్రజలు కు మింగుడు పడలేదు.

అసలు ఎందుకు ఈ నాటకం, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కి వారి మీద వారికే నమ్మకం లేని పరిస్థితి కనబడుతుంది.కేసీఆర్ గారికి ఏమయింది ఎందుకు తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్నారు ఎవరికి బోధ పడలేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చూస్తే ప్రతి యొక్క సారి రాజ్యాంగ విరుద్ధం మరియు చట్టవిరుద్ధంగా ను చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడం కోర్టు ధిక్కరనలు అపోజిషన్ పార్