తెలంగాణ ముఖ్యమంత్రి క్వారంటైన్ పూర్తి చేసుకుని వెలుగు లోకి వచ్చారు

KCR From paracetamol to begging the safety of state

ప్రగతి భవన్ లో కరోన కలకలం లేపిందని తెలంగాణ ముఖ్యమంత్రి 14 రోజుల క్వారంటైన్ ముగించుకొని నిన్న వెలుగు లోకి వచ్చినారు. ప్రజలందరు ఇప్పుడు దా ఊపిరి పీల్చుకొన్నారు. వొక విదంగా ప్రజలు సంబరపడి పోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే చేతలలో చేయకపోయిన మాటలతో జనాలను నమ్మించి మాయలు చేస్తుంటారు లే, మంచి టైమ్ పాస్ ఉంటుందిలే అని.

కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి తన రెండు వారముల క్వారంటైన్ నుండి వెలుగులోకి వస్తూనే ప్రగతి భవనంలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లి తన పనులను ప్రారంభించారు. కే సి ఆర్ గారు ఏ పని చేసిన అది అనూహ్యంగా నే ఉంటుంది. ఆ పని అతనికి లబ్ధి చే కూర్చే విదంగానే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడే రాజకీయ పరిణామాలు కొత్తగా చోటు చేసుకొంటూ ఉంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై తన్నిచ్చగా వైద్య సేవలు గురించి మాటలాడడం,కరోన కట్టడిలో ప్రభుత్వ వైఖరి ని ఎత్తి చూపడం, బిజేపి జాతీయ్య కార్యదర్శి మురళీధర్ రావ్ సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ గుడి ని కూలదోసి న దానికి ఆగ్రహము వ్యక్తం చేయడం వంటి పనులు ముఖ్య మంత్రి గారికి మింగుడు పడలేదు.

మురళీధర రావు ఇంకొంత ముందుకు పోయి నల్ల పోచమ్మ గుడి ని కూలద్రోసినారు అదేవిధంగా కేసిఆర్ ప్రభుత్వం కూడా కూలిపోతంది అని జోష్యం చెప్పినారు. ప్రతి పక్షం బలంగా లేనందున కేసిఆర్ తన ఇష్టానుసారముగా వ్యవహరిస్తున్నారు అని జనులు వాపోతున్నారు అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ తప్పిదమును తెలిసికొని కుమిలిపోవడం తప్ప చేసేదేమిలేదు.

Also Read: టిటిడి వివాదం తెరపైకి మరల రమణ దీక్షితులు వివాదస్పద వ్యాఖ్యలు.