ఏ పి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు లోను ఎదురు దెబ్బ

Contempt of court to YSRCP led AP Government: Supreme court

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు లోను గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఏ పి, ఎస్ ఇ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తన పదవి కుదింపు పై ప్రత్యేక ఆర్డినెన్స తెచ్చి ఏ పి ప్రభుత్వ తొలగింపు పై హై కోర్టు ఆగ్రహము వ్యక్తం చేస్తూ ఆ ఆర్డినెన్స ఉద్దేశ పూర్వకంగా తెచ్చినదని ఎస్ ఇ సి రమేష్ కుమార్ ని
తిరిగి విధులలోకి తీసుకోవలసిందిగా సుమారు రెండు నెలలు క్రితము తీర్పిచ్చింది.

దీనిని సవాలు చేస్తూ ఏ పి ప్రభుత్వం సుప్రీం కోర్టు లో అపీల్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సవాలు మీద ఈ రోజు సుప్రీం కోర్టు లో వాదనకు వచ్చింది. సుప్రీం కోర్టు దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ కేసును మూడు వారములు కు వాయుదా వేయడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఏ పి ప్రభుత్వ ఇసి విధులు నిర్వహణకు ఎవరూ లేదు తాత్కాలికంగా ఎవరినైనా అపాయింట్ చేయుటకనుగునంగ స్టే కోరుతున్నామన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను తోసిపుస్తూ ఎవరూ ఎందుకు లేదు హై కోర్టు తీర్పు తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారున్నారు కదా అని సీజెఐ బోంబ్డే అడుగగా నాలుక కొరుక్కొన్నంత పనైంది ఏ పి ప్రభుత్వ న్యాయవాదికి.

ఏదిఏమైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఏ పి ప్రభుత్వం ఇదివరకే హైకోర్టు లో సుమారు 65 ఎదురు దెబ్బలు తిన్నా, సుప్రీం కోర్టు లో రెండు ఎదురు దెబ్బలు తిన్నాతన పంతాన్ని మాత్రం వదలడం లేదు. న్యాయ స్తానాలకు విలువ ఇవ్వడం లేదు. కడకు ఏ పి ప్రభుత్వ స్పీకర్ కూడ సాధారణ కార్య కర్త లాగా న్యాయ స్తానాలను దుయ్య బట్టడం నిన్న మొన్న పత్రిక విలేకర్ల ఇంటెర్యు లో చూచినాము. ఇకనైనా ఏ పి ప్రభుత్వం పంతాలు, కక్షలు వదిలేసి ఓటేసిన ప్రజలకు మంచి పాలన అందించాలని అందరి ఎదురు చూపు.

Also read: Telangana High Court shut down after Staff contract COVID-19