ఆంధ్రప్రదేశ్ లో మూడు ముక్కలాట- బీజేపీ చేతిలో జగన్ కీలుబొమ్మ?

Andhra Pradesh 3 capital bill

ఇక ఆంధ్రప్రదేశ్ లో మూడు ముక్కలాట మొదలయింది. ప్రదమ మంత్రి మోడీ ఆంద్రప్రదేశ్ లో గవర్నర్ విశ్వభూషన్ మూలముగా రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకొంటున్నారని మాత్రం అర్ధమయింది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కాలూనవీలుపడదు అని బీజేపీ యొక్క పాలసీలను తుంగలో తొక్కి జగన్ మోహన్ రెడ్డి తో చేతులు కలిపి అతనిని బీజేపీ స్వలాబాల కోసం వాడు కొంటున్నారనేది ప్రజలకు కూలంకషంగా అర్థమయింది.

ఆంద్రప్రదేశ్ లో మోడీ చెప్పి నట్లు దా అంతా జరుగుతూ ఉందని ఇప్పుడు తేట తెల్ల మయింది. అర్ధరాత్రివేళ యస్ఇసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించి నట్లు నియమించి మూడు రాజదానుల బిల్లు ను ఆమోదము చేసే దానిలో కుట్ర పూరిత మైన రాజకీయం మోడీ జరిపిస్తూ ఉన్నారని అనుమానించక తప్పలేదు. దీనిలో ప్రజల మనోభావాలు దెబ్బ తింటున్న దని బీజేపీ గాని మోడి గాని మరచి పోకూడదు. బీజేపీ కుట్ర రాజకీయం వలన రాజస్థాన్ లో అవినీతిని చేపట్టి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు శతవిదాల పావులు కదుపతా ఉంది.

ఇలాగే మద్య ప్రదేశ్ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ ని చీల్చి బీజేపీ పదవిని చేపట్టింది. ప్రతి పక్షాల పార్టీ లే ఉండకూడదని అంటే అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లే అనడంలో సందేహం లేదు. ఇక మాట తప్పను మడమ తిప్పను, వొకే వొక చాన్స్ ఇవ్వండి అని ప్రజలకు మాయమాటలు చెప్పి ముద్దులు పెట్టి పదవి చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ఈరోజు చేసేదంతా ప్రజలకు విరుద్ధంగా నే ఉంది.ఇక్కడ పరిపాలన అంటే పగ ,ప్రతీకారము దళితుల పైన అరాచకాలు చూస్తుంటే ఇప్పుడే ఇక్కడ బీజేపీ పాలనదా జరుగతుందేమో అని ప్రజల అనుమానం. ఏదీ ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల యొక్క అభివృద్ధి కాదు ముఖ్యం వారి స్వలాబాలు దా ముఖ్యం.