ముఖ్య మంత్రులు తీరు ప్రభుత్వ కట్టడాలను కూలదోయడం

Telangana ne secretariat

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత సచివాలయ ప్రాంగణాన్ని కూల్చి వేయు సంఘటన చాలా మందికి అంటే ఉభయ రాష్ట్రాల ప్రజలు మనోవిచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనము గమనించదగ్గ విషయమేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైనా కట్టడములను కూల్చాలంటె చాలా సంతోష పడి వారేమనుకొంటే అది చేసి తీరుతారు.

ఇటువంటి పనులు చేయుటకు వారికి వారే సాటి. వీరికి ప్రజలు మనోభావాలతో పని లేదు.ఈ పాత సచివాలయాన్ని వొక ప్రయోజనాత్మక కట్టడముగా వాడుకొని ఉండవచ్చును,ఎప్పుడూ ప్రభుత్వం ఆ విదంగా ఆలోచించాలి. కట్టి న కట్టడలాను కూల్చుటకు ప్రయత్నించకూడదు. ఎన్నో మంది పేదలు ఇళ్లు లేకుండ చెట్లు క్రింద వాన కు, ఎండకు మాడి మసై పోతున్నారు. మన దేశంలో 100 శాతం ప్రజలు ఇండ్లలో ఉండి బ్రతికే రోజులు ఇంకా రాలేదు.

ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తక్షణమే ప్రజా వేదికను మునుపటి ప్రభుత్వం కట్టినదని మారు ఆలోచించకుండా దానిని కూల్చేంతవరకు ఆ ముఖ్యమంత్రి నిద్ర పోలేదను వార్త అందరికి తెలిసిందే. ఇందుకా ప్రజలైన మేము మీకు ఓటేసి గెలిపించదని ప్రజలు వాపోవడం తప్ప మరేమి చేసేది లేదు. ఇది మాదిరి కట్టడాలని వొక హాస్పిటల్ గానో లేక వొక మోను మెంటు గానో వాడుకొని ఉంటే ప్రజలు చాలా సంతోష పడి ఉందురు.

READ: Prabhas & Hrithik Roshan to team up for a multistarrer movie?

ALSO READ: AP Minister Balineni Srinivas’s convoy accident on ORR