టిటిడి వివాదం తెరపైకి మరల రమణ దీక్షితులు వివాదస్పద వ్యాఖ్యలు.

Ramana deekshitulu comments on TTD

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి తిరుమల దేవస్థానంలో జరిగే పనులపై చర్చనీయాంశంగానే మారింది. వై వి సుబ్బారెడ్డి నిజానికి క్రీస్తు మతానికి చెందిన వారని, బస్సు టికెట్లు వెనుక క్రీస్తు పేరట సందేశములు ముద్రించడం, ఇప్పుడు సప్తగిరి పత్రిక తో పాటు క్రీస్తువ కధనం పుస్తకం పెట్టి చందాదారులకు పంపడం, ఇదేమిటి అని అడిగితే మాకు గిట్టని వారు ఎవరో చేసి ఉండవచ్చు అని సమాధానమివ్వడం లాంటి చర్యలు ప్రజల కు మింగుడు పడలేదు.

ఇప్పుడు టిటిడి ప్రదాన అర్చకులైన రమణ దీక్షితులు కొత్తగా వొక వివాదం తెరపైకి తెచ్చియున్నారు. కొండ పైన అన్ని సేవలు చంద్రబాబు నాయుడు హయాంలో తెచ్చినవే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని పాలకమండలి పెద్దలు జగన్ మోహన్ రెడ్డి మాటలు వినడం లేదని జగన్ మోహన్ రెడ్డి కి ఇతనే కట్టుబడి ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

మునుపటి టీడీపీ హయాంలో నీల పథకం కనబడలేదని అది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని ఆలయంలో అన్ని చోట్లా త్రవ్వి నారని ఇలా అంతా ఆరోపణలు చేసిన అర్చకులు అప్పట్లో నిమిషాల మీద జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అతను ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు చూడడం జనులకు చోద్యముగా గోచరిస్తూ ఉంది. అసలు ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులుకు ఏమి కావాలని, ఏమిటి ఈ రాజకీయ్యం అని ప్రజలకు అంతు చిక్కని ప్రశ్నగా ఉంది.

Also Read: 27000 Coronavirus test samples missing in Prakasam District