ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పైన- నటులు, రాజకీయ వేత్త అయిన శ్రీ కోటా శ్రీనివాస్ గారి వ్యంగ్యం.

Kota Srinivasa Rao jagan

కోటా శ్రీనివాస రావు వొక సీనియర్ తెలుగు నటుడు దాదాపు మూడు నాలుగు దశకాలుగా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 600 సినిమాలు లో విలన్, కారెక్టర్ మరియు కమెడియన్ పాత్ర లలో ప్రజల ను రంజింప జేసిన వొక గొప్ప నటుడు. కోటా శ్రీనివాస రావు ఏది చెప్పాలన్న, ఏది మాట్లాడలన్న బాహాటముగా చెప్పే స్వభావము కలవారు. అటువంటి అనుభవ బహు ప్రగ్నాశాలి అయిన శ్రీ కోటా శ్రీనివాస రావు నిన్న అతని జన్మ దిన సందర్భంగా పలు తెలుగు టీవీ చానల్ కు ఇంటర్యు ఇవ్వడం జరిగింది. కోటా శ్రీనివాస గారు అతని జీవిత ప్రయాణము లో ఎన్నో చేదు అనుభవాలను వొడిదుడుకలను ఎదుర్కొన్న వారు ఆచితూచి బదులు చెప్పెడి వారు.

ఇతను తన ఇంటర్యు మూలముగా విలేకరుల ప్రశ్నలకు తన సినిమా అరంగేట్రం గురించి, తన సినిమా అనుభవాలు చెబుతుంటే టీవీ ల ముందు ప్రజలు అలా కూర్చుండి పోయూరంటే అది అతిశయోక్తి కాదు. శ్రీ కోటా శ్రీనివాస రావు గారు సినిమా అనుభవమే కాకుండ రాజకీయ అనుభవము కూడా ఉంది.ఇతను వొక సారి బిజెపి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేసింది అందరికి తెలిసిందే. వొక టీవీ చానల్ వారు ఇతనిని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి మరియు ఇప్పటి ప్రభుత్వ తీరును గురించి ప్రశ్నించడం జరిగింది.


దీనికి అతను సమాధానమిస్తూ నేను రాజకీయంగా ఎక్కువ మాట్లాడడానికి ఇష్ట పడక పోయిన మునుపటి రాజకీయ వేత్త గా నాకు ఆ అర్హత ఉంది కాబట్టి నేను చెబుతున్నాను అంటూ నిద్ర పోయే వాడిని లేపచ్చు నిద్ర పోయేవాడిలా నటించే వాడిని లేపలేం అని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మీద వొక వ్యంగ్య కనపరచినారు. ప్రభుత్వం నడిచే రీతి కూడ తనకు నచ్చలేనట్లు ఉంది అని చెప్పకుండ చెప్పినారనిపిస్తుంది.