పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ఏపీ లో భూ కబ్జాలు?

Jagan free housing scheme
Plots allotted for free housing scheme submerged in rain water

అధికార పార్టీ వర్గం ఎన్నో అవినీతి పనులకు దిగజారడం కొత్తేమి కాదు మన దేశానికి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా పదవికి వచ్చినప్పటి నుంచి ఏదో వొక వివాదము లో ఇరుక్కొని పోవడం ఆనవాయితీగా మారింది. సంక్షేమ పథకాల పేరిట కేంద్రం ఇచ్చిన నిధులను మేమిస్తున్నాము అని ఇచ్చేసి అదీన్ను వారియొక్క సొంత పార్టీ వారికే ఇవ్వడం సెల్ఫీలు తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంది.అమ్మ వొడి పధకం ఇక చెప్పనవసరం లేదు, ఇంట్లో ఉండే ఆడువారికి ఇవ్వడం మగ వారికేమొ బార్లు తెరవడం. దీనినే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు.

ఇందులో తెల్ల రేషన్ కార్డు పసుపు రేషన్ కార్డు అని, ఇన్కమ్ టాక్సు కట్టే వారికందరికి అమ్మవొడి లేదని ఎన్నో అవకతవకలు చేసి మేము అమ్మవొడి ఇచ్చినామని విర్రవీగినారులే. తరువాత పేదలకు ఇళ్ల స్థలాలు పధకం, ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇళ్ల స్థలాల పేరిట ఎన్నికలలో రిగ్గింగు చేసుకున్నట్టు భూ కబ్జా లు చేసి అయిదు లక్షలు విలువ చేసే భూమిని ఇరవై లక్షల కు కొని పెద్ద భూ దందాలు చేశారు ఈ పాలకులు. ఎవరైన ఇదేంటి అని అడిగితే వారి మీద దౌర్జన్యము నకు దిగడం కేసులు పెట్టి బొక్కలో తోస్తామనడం.

ఇటీవల వొక మంత్రి అతని అనుచరులు కలిసి విజయవాడ సమీపముగా యున్న సత్యనారాయణ పురంలో శివుడు గుడికి చెందిన భూమి 900 గజాలు విస్తీర్ణమును ఏకంగా 10 కోట్ల రూపాయల కు కబ్జా చేసినారు. అదేవిధంగా గుంటూరు వద్ద ఏకంగా బ్యాంకులో తాకట్టు ఉన్న భూమిని ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి కబ్జా చేయాలనుకొన్నపుడు అది డీసీపీ బ్యాంకు కు తెలిసి వారు అడ్డుకోవడం జరిగింది. ఇలా సంక్షేమ పథకాల పేరిట పేదలకు వొరిగిందేమి లేదు వైకాపా పార్టీ శ్రేణులకు దా మేలు జరుగుతూ ఉందని ప్రజల మనోభావం.