వైకాపాలో అంతర్యుద్ధం ప్రారంభమైందా?

YSRCP desperation to shift capital, bill gone wrong again!

యాదవ కులంలో ముసలం పుట్టినట్లు వైకాపా లో కూడా ముసలం పుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మూడు రాజదానులు బిల్లు మరియు సీఆర్డిఏ బిల్లు లను గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ప్రతి పక్ష పార్టీ లు వారి వారి అజెండా లతో మందుకెళ్ళడం మనము చూస్తూ ఉన్నాము. ఈ బిల్లుల ఆమోదాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది రాజీనామా లకు వెళ్ళాలనే వాదన వినిపిస్తుంది అన్న దాంట్లో సందేహం లేదు.

ఇప్పటికే దీనిని నిరసిస్తూ టీడీపీ కి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామాను ఆ పార్టీ అధినేత అద్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు కి సమర్పించడం జరిగింది. ఇక జనసేన విషయానికొస్తే ఈ రోజు 3 గంటల కు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో వారు న్యాయ పరంగా ముందుకెళ్ళాలని తీర్మానించుకొన్నారు. అమరావతి జేఏసి, ఉద్యమాన్ని ఇంకా ఉదృతంగా మందుకు తీసుకెళ్లాలని నిర్నయించుకొంది.

ఇదంతా ఇలా ఉండగా ఏకంగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే లు కూడా రాజీనామాల బాటలో ఉన్నట్లు వార్తలు రావడంతో వైకాపా పార్టీ లో గందరగోళం మొదలయ్యింది అనే చెప్పాలి. వైకాపా కు చెందిన కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలు వొక పారిశ్రామిక వేత్త హోటల్ లో రహస్య మంతనాలు జరిపినట్లు ఆ మంతనాలు లో 29 మంది కలిసి కట్టుగా రాజీనామాలు చేయాలని లేదంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, రాజీనామా లేఖలు స్పీకర్ తమ్మినేని సీతారాముకు వైకాపా పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి కి సమర్పించడం అని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉందనడంలో సందేహం లేదు.

ఇదే గాని జరిగితే జగన్ మోహన్ రెడ్డి కి తలనొప్పి పాృరంభం అయినట్లే అని రాజకీయ విశ్లేషకుల వాదన. మొత్తానికి వొకటి రెండు రోజులు ఆగి చూస్తే గాని క్లారిటీ రాదు. వేచి చూద్దాం